: పరిటాల రవికి నటుడు వివేక్ ఒబెరాయ్ నివాళులు
అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరిగిన టీడీపీ నేత పరిటాల రవి వర్థంతి కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవి ఘాట్ కు ఆయన నివాళులర్పించారు. ఏపీ సభాపతి కోడెల శివప్రసాద్, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుతో బాటు పలువురు నివాళులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆయన అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు. దర్శకుడు రాం గోపాల్ వర్మ రూపొందించిన 'రక్తచరిత్ర' చిత్రంలో వివేక్ ఒబెరాయ్, రవి పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన మంత్రి పరిటాల సునీత (రవి భార్య) కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు.