: ఒబామా తాజ్ మహల్ సందర్శన రద్దు!


మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 27న ఆయన తన భార్య మిచెల్లీతో కలసి తాజ్ మహల్ ను సందర్శించాల్సి ఉంది. తాజాగా ఆ కార్యక్రమం రద్దైనట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి సమాచారం అందింది. అయితే ఇందుకు కారణం మాత్రం తెలియరాలేదు. భద్రత కారణాల వల్ల ఒబామా త్వరగా అమెరికా వెళ్లిపోవాలనుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు వస్తున్నారనుకుని ఇప్పటికే విస్తృత సన్నాహాలు చేసుకున్న భారత్ కు ఇది పెద్ద ఇబ్బందికర పరిస్థితి. ఒబామా సందర్శిస్తారని తెలిసి అధికారులు ఆగ్రా వద్ద భారీగా పరిశుభ్రత, భద్రత చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News