: భారత్ ఆహ్వానించడమే ఒబామాకు అసలైన గౌరవం: వైట్ హౌస్
"భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఆహ్వానించడం ఆయనకు అసలైన గౌరవం. భారత జాతీయ వేడుకలను ప్రెసిడెంట్ ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. ఈ పర్యటన కోసం అధ్యక్షుడు చాలా ఉత్సాహంగా ఉన్నారు" అని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. పరేడ్, ఇతర కార్యక్రమాలు నిర్వహించే ఆ రోజును ముఖ్యమైన రోజుగా చేసేందుకు పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ జోష్ ఎర్నెస్ట్ తన రోజువారీ మీడియా సమావేశంలో చెప్పారు.