: ఆప్, బీజేపీపై దిగ్విజయ్ మాటల దాడి


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలపై కాంగ్రెస్ మాటల దాడి కొనసాగుతోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి ఆప్ 'టీమ్ బి' అని ట్విట్టర్ లో విమర్శించారు. "ఏఏపీ, ఆ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ లు బీజేపీకి 'బి టీమ్'. అయితే మరి ఆప్ కు మీరెందుకు మద్దతిస్తున్నారని మీరు అడగవచ్చు. బీజేపీ, దాని బి టీమ్ లో ఎవరు ఉత్తమమో వారినే మేము ఎంచుకున్నాం" అంటూ డిగ్గీ చాలా తెలివిగా ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News