: బాసరకు పోటెత్తిన భక్తులు... వేడుకగా అక్షరాభ్యాసం!
వసంత పంచమిని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. మూడు రోజుల పాటు జరగనున్న వసంత పంచమి వేడుకలు నేటి తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యాయి. చిన్నారుల అక్షరాభ్యాసానికి శ్రీకారం చుట్టేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు బాసరకు తరలివచ్చారు. దీంతో బాసర పరిసరాలు జనసమ్మర్ధంతో కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీని అంచనా వేసిన అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం చిన్నారులతో అక్షరాలు దిద్దించే కార్యక్రమం జోరుగా సాగుతోంది.