: హైదరాబాదు పబ్ లో సినీ నటి అంజలి హల్ చల్... మద్యం మత్తులో నిర్వాహకులపై తిట్ల దండకం


తెలుగు, తమిళ సినీ రంగాల్లో ప్రముఖ నటిగా కొనసాగుతున్న నటి అంజలి నిన్న రాత్రి హైదరాబాదులోని ఓ పబ్ లో హల్ చల్ చేసింది. స్నేహితులతో కలిసి మద్యం సేవించి ఎంజాయ్ చేసిన ఆమె, పబ్ నిర్వాహకులపై తిట్ల దండకం అందుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పంజాగుట్ట పోలీసులు ఎట్టకేలకు ఆమెను అక్కడినుంచి పంపించివేశారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత స్నేహితులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని తబల పబ్ కు అంజలి చేరుకుంది. ఫ్రెండ్స్ తో కలిసి మద్యం సేవించిన అంజలి అనంతరం డ్యాన్స్ ఫ్లోర్ వద్దకు వెళుతున్న క్రమంలో ఓ యువకుడు ఆమెకు అడ్డువచ్చాడు. దీంతో మద్యం మత్తు తలకెక్కిన ఆమె ఒక్కసారిగా ఆ యువకుడిని దూషించడం మొదలుపెట్టింది. అప్పటికీ ఆగ్రహం చల్లారని ఆమె, యువకుడితో పాటు పబ్ నిర్వాహకులపైనా తిట్ల దండకం అందుకుంది. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారమందించారు. దీంతో పబ్ కు చేరుకున్న పంజాగుట్ట పోలీసులు అంజలిని అక్కడి నుంచి పంపించివేసి పరిస్థితిని చక్కదిద్దారు.

  • Loading...

More Telugu News