: ‘దిల్ కీ బాత్‘... రేడియో ద్వారా ఢిల్లీ ఓటర్లతో కిరణ్ బేడీ ముఖాముఖి!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన రేడియో ప్రసంగం 'మన్ కీ బాత్' జనాదరణ పొందింది. తాజాగా భారత పర్యటనకు వస్తున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా మోదీతో కలిసి మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రజలతో మాట్లాడనున్నారు. మోదీ దూకుడుకు ఆకర్షితురాలై, బీజేపీ నేతగా మారిన మాజీ పోలీసు అధికారిణి కిరణ్ బేడీ కూడా ఇప్పుడు మోదీ అడుగుజాడల్లోనే పయనిస్తున్నారు. మోదీ మన్ కీ బాత్ తరహాలోనే ఢిల్లీ ప్రజలతో మాట్లాడేందుకు కిరణ్ బేడీ ‘దిల్ కీ బాత్’ పేరిట ప్రత్యేక కార్యక్రమానికి తెర తీస్తున్నారు. ఢిల్లీ ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాలు పన్నుతున్న ఆమె మాట్లాడుతూ, రేడియో శ్రోతలు అడిగే ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకే ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. మరి, దిల్ కీ బాత్ ఆమెకు లాభిస్తుందో, బెడిసికొడుతుందో చూడాలి.