: పూరీ జగన్నాథ్ చెంప పగులగొడతా: తెలంగాణ సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్


తెలంగాణ సీఎం కార్యాలయంలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ), ప్రముఖ గాయకుడు దేశపతి శ్రీనివాస్ శుక్రవారం సంగారెడ్డిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ హిట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ చెంప పగులగొడతానని ఆయన వ్యాఖ్యానించారు. వివరాల్లోకెళితే... మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలోని తారా డిగ్రీ కళాశాలలో ‘తెలంగాణ పునర్నిర్మాణం-అభివృద్ధి’ అనే అంశంపై శుక్రవారం సెమినార్ జరిగింది. ఈ సెమినార్ లో పాల్గొన్న సందర్భంగా దేశపతి శ్రీనివాస్, పూరీ జగన్నాథ్ పై విరుచుకుపడ్డారు. ‘‘సమాజాన్ని ఉద్ధరించాలని సినిమాలు తీస్తే, చంక నాకిపోతారని హీనంగా మాట్లాడిన పూరీ జగన్నాథ్ చెంప పగులగొట్టాలి. స్త్రీలు, ఉపాధ్యాయులు, తండ్రులను అవమానపరుస్తూ సీమాంధ్ర డైరెక్టర్లు బలాదూర్ కల్చర్ ను ప్రోత్సహిస్తున్నారు’’ అని దేశపతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News