: పెట్రోల్ ట్యాంకర్ ను ఢీకొట్టిన కారు... ఒకరు మృతి: బీఎన్ రెడ్డి నగర్ లో భారీగా ట్రాఫిక్ జామ్
హైదరాబాదులోని ఎల్బీ నగర్ పరిధిలోని బీఎన్ రెడ్డి నగర్ లో కొద్దిసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. సాగర్ రోడ్డుపై పెట్రోల్ ట్యాంకర్ ను కారు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. దీంతో సాగర్ రోడ్డుపై భారీ ఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. నడిరోడ్డుపై జరిగిన ఈ ప్రమాదంలో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం నేపథ్యంలో ట్యాంకర్, కారు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రోడ్డుకిరువైపులా వందలాది వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేస్తున్నారు.