: బోరబండలో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్ సోదాలు... 21 మంది అనుమానితుల అరెస్ట్
హైదరాబాదులోని బోరబండలో నేటి తెల్లవారుజాము నుంచి పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. బోరబండ పరిధిలోని అంజయ్య నగర్, కార్మిక నగర్, బాబా సెహగల్ నగర్ తదితర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఈ సోదాల్లో పోలీసులు ఇప్పటికే 21 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి రౌడీ షీటర్ పఠాన్ అలీ ఖాన్ ఇంటిలో సోదాలు చేసిన పోలీసులు రెండు నకిలీ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పోలీసుల సోదాల్లో భాగంగా భారీగా సారా, పెట్రోల్, డీజిల్, కిరోసిన్ నిల్వలు వెలుగుచూశాయి. సోదాల సందర్భంగా భవానీ నగర్ పరిధిలో వంద మంది దాకా బాల కార్మికులకు పోలీసులు విముక్తి కల్పించినట్లు తెలుస్తోంది. పోలీసులు గుర్తించిన బాల కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.