: అమెరికా జీతగాడు మరణించాడు: ఉగ్రవాదులు


అమెరికా సేవకుడిగా బతికిన అబ్దుల్లాహ్ అమెరికా సేవకుడిగానే మృతి చెందాడని ఉగ్రవాదులు తెలిపారు. సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాహ్ బిన్ అబ్దులాజిజ్ మరణంపై ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, ఇతర ఉగ్రవాద సంస్థలు, వాటి మద్దతుదారులు ఆన్ లైన్ లో హర్షం వ్యక్తం చేశారు. ముస్లిం సమాజానికి పట్టిన పీడ విరగడైందంటూ సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో కామెంట్లు పెట్టారు. అమెరికా జీతగాడిగా వ్యవహరించిన అబ్దుల్లాహ్ పశ్చిమాన ముస్లింల ఊచకోతకు కారణమయ్యారంటూ విమర్శించారు. రెండు ప్రార్థనా స్థలాలను దోచుకున్న దొంగ మరణించాడంటూ ఐఎస్ మద్దతుదారుడు ట్వీట్ చేశారు. దశాబ్దం క్రితం సౌదీ అరేబియాలో రాజరిక వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యమించిన అల్ -కాయిదాను అమెరికా దళాల సహాయంతో అబ్దుల్లాహ్ అణచివేశారు. దీంతో తీవ్రవాదులు ఆయన మృతిపట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News