: కేజ్రీవాల్ కు మరోసారి ఈసీ నోటీసు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు అందజేసింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర రాజకీయపార్టీల నుంచి డబ్బులు తీసుకుని ఆప్ కు మాత్రమే ఓటు వేయాలని పేర్కొన్న వ్యాఖ్యలపై కేజ్రీవాల్ కు ఈసీ నోటీసులు జారీ చేసింది. గతంలో జరిగిన ఎన్నికల్లో ఇవే వ్యాఖ్యలు చేసిన కేజ్రీవాల్ కు ఈసీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ మరోసారి అవే వ్యాఖ్యలు చేసి వివాదం రేపారు.