: ఏపీకి జూరాల నుంచి చుక్క నీరు వదలం: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె
నాగార్జున సాగర్ డ్యాంకు చెందిన 13 గేట్లు, కుడి కాల్వ నిర్వహణ ఆంధ్రప్రదేశ్ అడగడం సరికాదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏపీ సర్కార్ ఇలానే వ్యవహరిస్తే జూరాల నుంచి చుక్క నీరు కూడా రానివ్వమని హెచ్చరించారు. తెలంగాణలో పంటలు ఎండబెట్టేందుకే చంద్రబాబు విద్యుత్ ఉత్పత్తి ఆపారని ఆయన ఆరోపించారు. సాగర్ డ్యామ్ పై ఏపీ సర్కారు దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.