: తాజ్ దగ్గర ఆ మూడు గంటలు ఫోన్లు కూడా పని చేయవు
ప్రపంచ ప్రసిద్ధ ప్రేమ చిహ్నం తాజ్ మహల్ వద్ద ఈనెల 27న సెల్ ఫోన్లు మూగబోనున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తాజ్ సందర్శనకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన మూడు గంటల పాటు తాజ్ లో విహరించనున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకుండా జామర్లు ఏర్పాటు చేశారు. ఈ మేరకు, అమెరికా భద్రతా బలగాలు తాజ్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.