: స్వైన్ ఫ్లూ పై ఆందోళన వద్దు: కేంద్ర మంత్రి నడ్డా
స్వైన్ ఫ్లూపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. హైదరాబాదులో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు పంపిన త్రిసభ్య బృందం నివేదిక ఇవ్వగానే, అవసరమైతే మరో బృందాన్ని పంపుతామని అన్నారు. స్వైన్ ఫ్లూ నివారణ మందులు, నిధులను అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.