: బ్రిటన్ ప్రధాని అనుకుని... ఒబామా భ్రమపడ్డారు
అమెరికా అధినేత తప్పులో కాలేశారు. సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఫాలోవర్స్ కు అందుబాటులో ఉండే బరాక్ ఒబామా ఓ సాధారణ వ్యక్తిని అనుసరిస్తున్నారు. ట్విట్టర్లో అత్యధిక ఖాతాదారులను కలిగి ఉన్న ఒబామా సాధారణ వ్యక్తిని ఫాలో కావడమేంటని ఆశ్చర్యపోతున్నారా? ఆయన పొరపాటు పడ్డారు. డేవిడ్ కామెరూన్ అనే వీడియో గేమ్ అభిమానిని ఒబామా బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్ అని భ్రమపడ్డారు. దీంతో అతని ఖాతాను ఫాలో కావడం మొదలు పెట్టారు. ఒకసారి ఫాలో అయ్యాక తీసెయ్యలేరు కదా? మొత్తానికి పేరు అగ్రదేశాధినేతను తప్పులో కాలేసేలా చేసింది!