: ఈసారి రేడియో ట్యాక్సీ సర్వీసుకు దరఖాస్తు చేసిన ఉబెర్ క్యాబ్స్
ఉబెర్ క్యాబ్స్ ఢిల్లీలో సర్వీసులను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఉబెర్ సంస్థకు చెందిన క్యాబ్ లో ప్రయాణికురాలిని డ్రైవర్ అత్యాచారం చేయడంతో ఆ సంస్థపై దేశ వ్యాప్తంగా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. డ్రైవర్లు చేసిన దానికి తామేం చేయలేమని నిస్సహాయత వ్యక్తం చేసిన ఆ సంస్థ, ప్రయాణీకులకు ఎలాంటి అపాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది. ఇకపై అలాంటి తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రేడియో ట్యాక్సీ లైసెన్సులు తీసుకునేందుకు ఢిల్లీలో ధరఖాస్తు చేసుకున్నామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఉబెర్ దరఖాస్తుపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.