: ఎట్టకేలకు విడుదలైన గాలి జనార్థనరెడ్డి
గనుల అక్రమ తవ్వకాల వ్యవహారంలో జైలుపాలైన గాలి జనార్థన్ రెడ్డి ఎట్టకేలకు మూడున్నరేళ్ల అనంతరం విడుదలయ్యారు. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి ఆయన కొద్దిసేపటి క్రితం విడుదలయ్యారు. ఈ నెల 20న ఓఎంసీ కేసులో సుప్రీం కోర్టు గాలికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బళ్లారి వెళ్లకూడదని, పాస్ పోర్టు అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానం షరతు విధించింది. గాలికి బెయిల్ మంజూరు చేయడం పట్ల సీబీఐ కూడా అభ్యంతరం తెలపలేదు. ఓఎంసీ కేసులో 2011 సెప్టెంబర్ 5న గాలి జనార్థన్ రెడ్డి అరెస్టయ్యారు. తాజా బెయిల్ తో, అన్ని కేసుల్లోనూ గాలికి బెయిల్ లభించినట్టయింది.