: విశాఖను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ... 'విశాఖ ఉత్సవ్' నేపథ్యంలో ఆందోళన


అందాల విశాఖకు దిష్టి తగిలినట్టుంది! విశాఖ మీద ప్రకృతి కన్నెర్ర చేసినట్టు కనపడుతోంది. హుదూద్ తుపాను తమకు నష్టాన్ని కలిగించినప్పటికీ, తాము మనస్థైర్యాన్ని కోల్పోలేదని, విశాఖ ఉత్సవాలు నిర్వహించి ప్రపంచానికి తెలుపుదామనుకునేంతలో మరోసారి ప్రకృతి కన్నెర్ర చేసింది. తెలంగాణలో పలువురిని బలితీసుకున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి విశాఖలోనూ కనిపించిందనే వార్తలు అక్కడి వారిని ఆందోళనలోకి నెడుతున్నాయి. మూడు రోజులపాటు నగరంలో విశాఖ ఉత్సవ్ నేడు ప్రారంభం కానుంది. దీని కారణంగా ప్రజలు భారీ సంఖ్యలో గుమికూడతారు. దానికి తోడు విశాఖలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. ఈ నేపథ్యంలో స్వైన్ ఫ్లూ చెలరేగే అవకాశం ఉంది. స్వైన్ ఫ్లూ సోకిన వ్యక్తి ఎవరైనా ఆ సమూహంలోకి వస్తే, స్వైన్ ఫ్లూ మరింత మందికి సోకే అవకాశం ఉంది. అత్యాధునిక సౌకర్యాలు ఉన్న హైదరాబాదు లాంటి మహానగరంలోని పౌరులను ఆందోళనకు గురి చేసిన స్వైన్ ఫ్లూ, సౌకర్యాల లేమితో బాధపడుతున్న విశాఖను భారీగా కుదిపేసే అవకాశం ఉంది. దీంతో విశాఖ ఉత్సవ్ పై ఆందోళన నెలకొంది. కాగా, ప్రభుత్వం స్వైన్ ఫ్లూను సమర్ధవంతంగా అడ్డుకునేందుకు ప్రణాళికలు రంగం సిద్ధం చేస్తోంది. మంత్రి గంటా శ్రీనివాసరావు కేజీహెచ్ లో వైద్యులను అప్రమత్తం చేశారు. విశాఖలో స్వైన్ ఫ్లూ పై వైద్యఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఆరాతీస్తున్నారు.

  • Loading...

More Telugu News