: బంధువులు, స్నేహితుల సమక్షంలో జరిగిన త్రిష నిశ్చితార్థం
దక్షిణాది అందాల నటి త్రిష నిశ్చితార్థం యువ నిర్మాత, పారిశ్రామికవేత్త వరుణ్ మణియన్ తో నేటి మధ్యాహ్నం వైభవంగా జరిగింది. వరుణ్ నివాసంలో జరిగిన ఈ వేడుకకు వధూవరుల కుటుంబ సభ్యులు, దగ్గరి మిత్రులు, చిత్రపరిశ్రమకు చెందిన సన్నిహితులు హాజరయ్యారని తెలిసింది. ఈ సందర్భంగా కాబోయే భార్యకు వరుణ్ విలువైన కానుకలు ఇచ్చినట్టు సమాచారం. ఈ నిశ్చితార్థానికి ప్రముఖ డిజైనర్ నీతా లుల్లా డిజైన్ చేసిన రెడ్ కలర్ శారీలో త్రిష మెరిసిపోయింది. నాదెళ్ళ ఆంజనేయులు శెట్టి జ్యూయెలర్స్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి తెచ్చిన ఆభరణాలను ఆమె ధరించింది. వరుణ్ తెలుపు రంగు దోతి ధరించాడు. కాగా, వీరి వివాహ తేదీ ఇంకా నిర్ణయించలేదు. త్రిష నటించిన 'ఎన్నై అరిందాల్' తమిళ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే.