: మరోసారి శశిథరూర్ 'నమో' మంత్రం!


కాంగ్రెస్ మాజీ మంత్రి, తన భార్య సునంద మృతిలో సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న శశిథరూర్ అవకాశం దొరికినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీని పొగడటమే పనిగా పెట్టుకున్నారు. తాజాగా జైపూర్ లో జరుగుతున్న లిటరేచర్ ఫెస్టివల్ లో పాల్గొన్న ఆయన "దేశంలో రాజకీయాలను మోదీ మార్చివేశారు. గుర్తింపు కోసమే వున్న రాజకీయాలను ఆయన అభివృద్ధి దిశకు మార్చారు" అని అన్నారు. "మోదీ చరిత్ర పుటల్లో స్థానం సంపాదించుకోగలరు. కానీ ప్రస్తుతం విపక్షంలో వున్న మేము ఆ పని ఇప్పటివరకూ చేయలేకపోయాము" అని కూడా ఆయన అన్నారు. ఇలాంటి పొగడ్తలను పరిశీలిస్తున్న రాజకీయ పండితులు శశిథరూర్ సైతం బీజేపీలో చేరేందుకు మార్గం వెతుక్కుంటున్నట్టు ఉందని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News