: ఉద్యోగాలిప్పిస్తానని రూ. 26 లక్షలు నొక్కేసిన మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు


కరీంనగర్ జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను మోసం చేసిన మహిళను గోదావరిఖని టూటౌన్ పోలీసులు నేడు అరెస్టు చేశారు. కనుకుల మనోజ అలియాస్ మనోజ్ తివారీ (22) పలువురికి సాఫ్ట్‌ వేర్, టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని సుమారు రూ. 26 లక్షలు వసూలు చేసింది. ఆ తరువాత ఎన్నిరోజులైనా ఉద్యోగాలు ఇప్పించలేకపోవటంతో కమాన్‌పూర్ మండలం చిందెల్ల గ్రామానికి చెందిన గాజుల కనక శేఖర్, స్రవంతిలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మనోజను అదుపులోకి తీసుకున్నారు. ఈమెతో పాటు ముఠాలోని మరో ఆరుగురు పరారీలో ఉన్నారని, వారు హైదరాబాదులో ఉండవచ్చని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News