: ఆకతాయి చెంప చెళ్లుమనిపించిన హైదరాబాదు యువతి


ఆకతాయిల ఆట కట్టిస్తున్న 'షీ-టీమ్‌'ల పుణ్యమాని నగర యువతులు, మహిళల్లో ధైర్యం పెరుగుతోంది. తాజాగా వెంటపడి, ఫోన్ నెంబర్ కావాలని వేధిస్తున్న యువకుడి చెంప చెళ్లుమనిపించిందో ధైర్యవంతురాలు. పేట్‌ బషీరాబాద్ అంగడిపేట గడిమైసమ్మ ఆలయ సమీపంలో ఓ యువకుడు అటుగా వెళ్తున్న యువతి వెంటపడ్డాడు. ఫోన్ నెంబర్ ఇవ్వాలని వేదించాడు. కొంతసేపు వాడిని భరాయించిన యువతి కోపం కాసేపటికి కట్టలు తెంచుకుంది. వాడిని నడిరోడ్డుపై పట్టుకొని చెంపలు వాయించి బుద్ది చెప్పింది. ఆ ప్రబుద్ధుడికి బుద్ధి వచ్చిందో లేదో?!

  • Loading...

More Telugu News