: అక్షయ్ కుమార్ 'బేబీ'పై పాక్ లో నిషేధం
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తాజా చిత్రం 'బేబీ'పై పాకిస్థాన్ లో నిషేధం విధించారు. ఓ భయంకరమైన టెర్రరిస్టును పట్టుకునేందుకు భారత గూఢచారి చేసే ప్రయత్నమే ఈ సినిమా ఇతివృత్తం. దీనిపై పాక్ సెన్సార్ బోర్డు నిషేధం విధించింది. ఈ చిత్రంలో ముస్లిింలను దుర్మార్గులుగా చిత్రీకరించారని, నెగెటివ్ క్యారెక్టర్లకు ముస్లిం పేర్లే పెట్టారని 'డాన్' పత్రిక పేర్కొంది. ఈ సినిమా నేడు పాకిస్థాన్ లో కూడా విడుదల కావాల్సి ఉంది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ తో పాటు తెలుగు నటుడు రానా దగ్గుబాటి కూడా నటించాడు. తాప్సీ కథానాయిక. ఎంఎం కీరవాణి, మీట్ బ్రదర్స్ అంజన్ స్వరాలు కూర్చారు.