: యూపీఏ చేయలేకపోయింది... మోదీ చేస్తారా?!


అమెరికాతో రక్షణ ఒప్పందాలు కుదుర్చుకోవాలని భారత్ చాలాకాలంగా యోచిస్తోంది. అయితే అగ్రరాజ్యంతో డీల్ కుదరాలంటే ఆ దేశ చట్టాలను అనుసరించి కొన్ని నిబంధనలు పాటిస్తామని సంతకాలు చేయాల్సివుంది. వాటిల్లో కొన్ని భారత సార్వభౌమత్వానికి ప్రశ్నలు సంధించేలా ఉండటంతో యూపీఏ ప్రభుత్వం ఆ ఒప్పందం జోలికి పోలేదు. మోడీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అమెరికా ప్రభుత్వం ఒక మెట్టు దిగివచ్చినట్టు తెలుస్తోంది. మరి రక్షణ ఒప్పందాల విషయంలో యూపీఏ చేయలేకపోయినదాన్ని మోదీ చేస్తారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ డీల్ కుదిరితే ఇరు దేశాల యుద్ధ నౌకలు పోర్టులను కలసి వాడుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఒకరి విమానాశ్రయాలను మరొకరు వాడుకోవడం వంటివి వీలవుతాయి. సాంకేతికత బదలాయింపునకు వీలుపడుతుంది. కాగా, అమెరికా తొందరపడకుంటే భారత్ మరో దేశంతో డీల్ కుదుర్చుకునేందుకు ముందడుగు వేయవచ్చని, దానివల్ల చాలా నష్టం వస్తుందని కొందరు అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. మరి డీల్ కుదురుతుందో? లేదో? మరో నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది.

  • Loading...

More Telugu News