: తల్లిని కట్టేసి, చిన్నారి నరబలి... రంగారెడ్డి జిల్లాలో ఘాతుకం
గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు చేస్తున్న ఓ దుర్మార్గుడు పది నెలల పసిపాపను బలిచ్చిన ఘటన రంగారెడ్డి జిల్లా యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మైలాల నర్సింహులు నిన్న రాత్రి ఓ ఇంట్లోకి ప్రవేశించి లక్ష్మి అనే మహిళను కదలకుండా కట్టేసి, పది నెలల వయసున్న ఆమె కుమార్తెను ఇంటి బయటకు తీసుకెళ్లి హత్య చేశాడు. ఆ ఇంటి ముందు క్షుద్ర పూజ నిర్వహించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నర్సింహులు గతంలోనూ క్షుద్ర పూజలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.