: బీహార్ కోర్టులో పేలుడు... ఇద్దరు మృతి, 17 మందికి గాయాలు
బీహార్ లోని ఆరా సివిల్ కోర్టులో కొద్దిసేపటి క్రితం బాంబు పేలుడు సంభవించింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు, పోలీసుల అదుపులో ఉన్న ఓ వక్తి వద్దకు చేరుకునేందుకు ఓ మహిళ ప్రయత్నించింది. దీన్ని గమనించిన పోలీస్ కానిస్టేబుల్ ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో, ఆమె వద్ద ఉన్న బాంబు పేలింది. దీంతో, ఆమెతో పాటు కానిస్టేబుల్ కూడా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. భారత్ లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన ప్రారంభం కానున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై కేంద్రం వెంటనే స్పందించింది. ఘటనపై సమగ్ర నివేదిక అందించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, బీహార్ సీఎం జితన్ రామ్ మాంఝీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.