: నటుడు ఎంఎస్ నారాయణకు ఏమైందంటే...!
తెలుగు సినీ పరిశ్రమను, అభిమానులను దు:ఖ సాగరంలో ముంచి ప్రముఖ నటుడు ఎంఎస్ నారాయణ కన్నుమూశారు. ఆయన మృతికి సంబంధించిన హెల్త్ బులెటిన్ ను కొండాపూర్ లోని కిమ్స్ వైద్యశాల డాక్టర్లు విడుదల చేశారు. ఈ ఉదయం 9.40 నిమిషాలకు ఎంఎస్ తుదిశ్వాస విడిచారని బులెటిన్ లో పేర్కొన్నారు. మధుమేహం, గుండెపోటుతో హాస్పిటల్ లో ఎంఎస్ నారాయణ చేరారని తెలిపారు. మల్టీ ఆర్గాన్స్ (గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు) వైఫల్యంతో ఆయన మృతి చెందారని వెల్లడించారు.