: మాటలు రావడం లేదంటూ కన్నీటి పర్యంతమైన కొండవలస
ప్రఖ్యాత కమెడియన్ ఎమ్మెస్ నారాయణ మృతి పట్ల ఆయన సన్నిహితుడు, నటుడు కొండవలస లక్ష్మణరావు కదిలిపోయారు. మాటలు రావడం లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తాను అనారోగ్యం పాలైనప్పుడు ఎమ్మెస్ ధైర్యం చెప్పారని గుర్తు చేసుకున్నారు. క్రమశిక్షణ కారణంగానే ఆయన ఈ స్థాయికి ఎదిగారని, సెట్ లో ఉంటే తోటి నటులకు సలహాలు ఇచ్చేవారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎమ్మెస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి తీరనిలోటుగా భావిస్తున్నానని కొండవలస అన్నారు.