: తన కుమార్తె విషయంలో పొంగిపోయారు: ఎమ్మెస్ మృతిపై మంచు లక్ష్మి
నటుడు ఎమ్మెస్ నారాయణ అనారోగ్యంతో కన్నుమూయడం పట్ల మంచు లక్ష్మి స్పందించింది. ఎమ్మెస్ ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబం ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఫేస్ బుక్ లో పోస్టు పెట్టింది. అంకుల్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని, ఆయనను నటుడిగా తన తండ్రి మోహన్ బాబే ప్రోత్సహించారని తెలిపింది. ఆయనతో ఎన్నో సరదా జ్ఞాపకాలు ఉన్నాయని, అద్భుతమైన కెరీర్ సొంతం చేసుకున్నారని పేర్కొంది. ఎప్పటికీ గుర్తుండిపోతారని తెలిపింది. చివరిసారి ఆయనతో మాట్లాడినప్పుడు కుమార్తె శశి దర్శకత్వం వహించడం పట్ల గర్వంతో పొంగిపోయారని లక్ష్మి గుర్తు చేసుకుంది. ఎమ్మెస్ కుమార్తె శశి నారాయణ 'సాహెబా సుబ్రహ్మణ్యం' చిత్రానికి దర్శకత్వం వహించడం తెలిసిందే.