: ఎంఎస్ నారాయణ మృతి తెలుగు చిత్ర సీమకు తీరని లోటు: మెగాస్టార్ చిరంజీవి
ప్రముఖ హాస్య నటుడు ఎంఎస్ నారాయణ మృతి తెలుగు చిత్ర సీమకు తీరని లోటని రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. అనారోగ్యానికి గురైన ఎంఎస్ నారాయణ, నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాటం చేసి నేటి ఉదయం తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఎంఎస్ నారాయణ మృతి పట్ల చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంఎస్ నారాయణ మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటన్న చిరంజీవి, ఆయన ఆత్మకు శాంతి కలగాలని అన్నారు. ఎంఎస్ నారాయణ కుటుంబ సభ్యులకు చిరంజీవి తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.