: భోరున విలపిస్తున్న సినీ పరిశ్రమ!
సుమారు రెండు దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో వివిధ పాత్రలలో నటించి మెప్పించి నవ్వులు పూయించిన మైలవరపు సూర్యనారాయణ అలియాస్ ఎం.ఎస్.నారాయణ మరణంతో కళామతల్లి ఒక ముద్దు బిడ్డను కోల్పోయినట్లయింది. ఆయన మృతిని సినీ పరిశ్రమ తట్టుకోలేకపోతోంది. గడచిన నెల రోజుల వ్యవధిలో నలుగురు ప్రముఖులను సినీ పరిశ్రమ కోల్పోయింది. దీంతో తెలుగు చిత్రసీమ భోరున విలపిస్తోంది. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సంతాపాన్ని తెలుపుతూ కనీళ్ళను ఆపుకోలేక పోయారు. ఎంఎస్ ఎంత గొప్ప నటుడో, అంతకుమించి తనకు మరింత ఆత్మీయుడని హాస్యనటుడు కొండవలస అన్నారు. ఆయన స్వర్గస్తులయ్యారంటే మనసు చలించిపోతోందన్నారు. తాను అనారోగ్యంతో వుంటే ఎంఎస్ ఆదరించారని గుర్తుచేసుకుని విలపించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దర్శకుడు రాజమౌళి తన ఫేస్ బుక్ ఎకౌంటులో నివాళులు అర్పించారు. మరో హాస్య నటుడు అలీ కన్నీటి పర్యంతం అవుతూ, ఆయన తనకు ఒక గురువుగా ఎన్నో విషయాలు చెప్పేవారని, ఎంతో ఆప్యాయతగా మాట్లాడేవారని వివరించారు.