: ఢిల్లీ ఎన్నికల్లో 230 నామినేషన్ల తిరస్కరణ... బురారీ నుంచి అత్యధికంగా 18 మంది పోటీ


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు, పరిశీలన పూర్తయ్యాయి. దాఖలైన మొత్తం నామినేషన్లలో 693 అర్హత సాధించగా, 230 నామినేషన్లను వివిధ కారణాల పేరిట అధికారులు తిరస్కరించారు. ప్రస్తుతం ఎన్నికల బరిలో నిలిచేందుకు 693 మంది అర్హత సాధించగా, రేపు నామినేుషన్ల ఉపసంహరణ గడువు ముగిసేసరికి ఎంతమంది వెనకడుగు వేస్తారో చూడాలి. ఇక అత్యధిక నామినేషన్లు దాఖలైన నియోజకవర్గాల విషయానికొస్తే, బురారీ అసెంబ్లీ సీటుకు అత్యధికంగా 18 నామినేషన్లు దాఖలయ్యాయి. దక్షిణ ఢిల్లీలోని అంబేద్కర్ నగర్ నుంచి అత్యల్పంగా నలుగురు నామినేషన్లు వేశారు. ఇక ఢిల్లీ తాజా మాజీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బరిలోకి దిగుతున్న న్యూఢిల్లీ నియోజకవర్గానికి ఆయనతో కలుపుకుని మొత్తం 13 మంది బరిలోకి దిగుతున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ పోటీ చేస్తున్న కృష్ణా నగర్ నుంచి బేడీ సహా తొమ్మిది మంది నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ కూతురు షర్మిష్ట ముఖర్జీ కూడా గ్రేటర్ కైలాష్ నుంచి ఎనిమిది మందితో పోటీ పడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News