: తెలంగాణ పాఠ్యాంశంగా కేసీఆర్ దీక్ష, డిసెంబర్ 9 ప్రకటన!


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంలో టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన దీక్ష, 2009, డిసెంబర్ 9న కేంద్రం చేసిన ప్రకటన... కీలక ఘట్టాలు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మృతి తర్వాత ఉద్యమాన్ని ఉద్ధృతం చేసిన కేసీఆర్ 11 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి, కేంద్రం నుంచి తెలంగాణకు సానుకూల ప్రకటనను సాధించారు. ఆ దెబ్బతో అటు కేసీఆర్ దీక్షతో పాటు డిసెంబర్ 9 నాటి కేంద్రం ప్రకటన చరిత్ర పుటలకెక్కింది. తాజాగా ఈ రెండు ఘట్టాలకు పాఠ్యాంశాలుగా స్థానం కల్పించేందుకు తెలంగాణ సిలబస్ రివ్యూ కమిటీ తీర్మానించింది. 1956 నాటి నుంచి సాగిన ఉద్యమంలో పలు ఘట్టాలను పాఠ్యాంశాలుగా చేయాలని తీర్మానించిన ప్రభుత్వం ఈ రెండు ఘట్టాలకు మరింత ప్రాధాన్యమివ్వాలని తలపోస్తోంది.

  • Loading...

More Telugu News