: సబ్సిడీ వద్దనండి... సన్మానం చేస్తాం!
అధిక ఆదాయ వర్గాల వారు వంట గ్యాస్ సబ్సిడీని నిరాకరించి దేశ అభివృద్ధికి తమవంతు తోడ్పాటునివ్వాలని అధికారులు కోరుతున్నారు. గ్యాస్ సబ్సిడీ వదులుకునేందుకు ముందుకు వచ్చే ప్రజలకు సన్మానం చేస్తామని, ప్రశంసాపత్రం కూడా అందిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా పౌర సరఫరాల అధికారి శివశంకర్ రెడ్డి వినూత్న ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఆయన పిలుపునకు స్పందించిన పది మంది తమకు గ్యాస్ సబ్సిడీ వద్దంటూ జిల్లా పౌర సరఫరాల అధికారికి పత్రాలను కూడా రాసిచ్చారట.