: రెండో రౌండ్ లో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కు షాక్
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా జోడీకి పరాభవం ఎదురైంది. రెండో సీడ్ గా బరిలోకి దిగిన సానియా మీర్జా - సూ వీ జంట రెండో రౌండ్లోనే ఇంటి ముఖం పట్టింది. అన్ సీడెడ్ జోడీ అయిన డబ్రౌస్కీ - రొసోల్స్ కా చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 6-7, 4-6 వరుస సెట్లలో సానియా జోడీని డబ్రౌస్కీ జోడీ కంగుతినిపించింది. అన్ సీడెడ్ జంట చేతిలో ఓటమి పాలవడంతో సానియా జోడీ షాక్ కు గురైంది. సానియా మీర్జా నూతన తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.