: ఆసీస్ పేస్ బౌలర్ల బృందాన్ని తోడేళ్ల గుంపుతో పోల్చిన బ్రెట్ లీ


ఆస్ట్రేలియా పేస్ బౌలింగ్ విభాగం భీకరంగా ఉందని... ఇంతటి అత్యుత్తమ దళాన్ని తాను ముందెన్నడూ చూడలేదని ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ అన్నాడు. స్వదేశంలో జరగనున్న ప్రపంచకప్ లో ఆసీస్ పేస్ బౌలర్లను ఎదుర్కోవడం ఇతర దేశాల బ్యాట్స్ మెన్ కు కత్తిమీద సామేనని చెప్పాడు. స్టార్క్, హాజిల్ వుడ్, కమ్మిన్స్ లు 150 కిలోమీటర్ల స్పీడుతో బంతులను సంధించగలరని తెలిపాడు. మిచెల్ జాన్సన్ గురించి చెబుతూ, అతనో అద్భుతమైన బౌలర్ అని, ప్రత్యర్థి జట్లపై పైచేయి సాధించడంలో అతడిని మించిన వారు లేరు అంటూ కితాబిచ్చాడు. తోడేళ్ల గుంపు లాంటి ఆసీస్ పేస్ బౌలింగ్ విభాగాన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థులకు చాలా కష్టమని చెప్పాడు.

  • Loading...

More Telugu News