: చాలా మంది డాక్టర్లు టైంపాస్ చేస్తున్నారు... వాళ్లు అవసరం లేదు: ఈటెల
తెలంగాణలో చాలా మంది ప్రభుత్వ డాక్టర్లు టైంపాస్ కోసమే ఆసుపత్రులకు వస్తున్నారని... విధులను సరిగా నిర్వహించడం లేదని టీఎస్ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టైంపాస్ డాక్టర్లందరూ విధుల నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలని అన్నారు. లేకపోతే, టైంపాస్ డాక్టర్ల జాబితాను రూపొందించి నిబంధనల ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, వైద్యుల పనితీరు, స్వైన్ ఫ్లూ నివారణ చర్యలపై కరీంనగర్ కలెక్టరేట్ లో అధికారులతో ఈటెల సమావేశం నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.