: నిషేధించినా... పాక్ నుంచే కార్యకలాపాలు: జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్


ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారని ఆరోపిస్తూ జమాత్ ఉద్ దవా సహా హక్కానీ నెట్ వర్క్ పై పాకిస్థాన్ ప్రభుత్వం నిన్న నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ఈజీగా తీసుకున్నట్లున్నాడు. ఎందుకంటే, పాక్ ప్రభుత్వం నిషేధం విధించిన కొన్ని గంటల్లోనే అతడు ఘాటుగా స్పందించాడు. నిషేధం విధించినా, పాక్ భూభాగం నుంచే భవిష్యత్ కార్యకలాపాలు సాగిస్తానని ప్రకటించాడు. భారత్ ను ప్రసన్నం చేసుకునే క్రమంలోనే పాక్, తమపై నిషేధం విధించిందని కూడా హఫీజ్ వ్యాఖ్యానించాడు. అంతేకాక పాక్ నిషేధాజ్ఞలపై సుప్రీంకోర్టుకెక్కుతామని జమాత్ అధికార ప్రతినిధి చెప్పాడు.

  • Loading...

More Telugu News