: కేజ్రీ... విఫలమయ్యావ్, తప్పుకో!: శాంతి భూషణ్ ఘాటు వ్యాఖ్య


ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఆ పార్టీ వ్యవస్థాపకుల్లో కీలక భూమిక పోషించిన కేంద్ర మాజీ మంత్రి శాంతి భూషణ్ విరుచుకుపడ్డారు. ‘‘రాజకీయాల్లో విఫలమైన నీవు, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చెయ్’’ అంటూ ఆయన కేజ్రీవాల్ పై విరుచుకుపడ్డారు. మొన్న కిరణ్ బేడీపై ప్రశంసల జల్లు కురిపించిన శాంతి భూషణ్, నిన్న కేజ్రీవాల్ పై ప్రత్యక్ష దాడికి దిగారు. ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో శాంతి భూషణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘కేజ్రీవాల్ లో కేవలం విజయకాంక్ష మాత్రమే ఉంది. ఆప్ ప్రధాన లక్ష్యం అది కాదు. ఈ కారణంగా కేజ్రీవాల్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సిందే. కేజ్రీవాల్ తన చుట్టూ ఓ వలయాన్ని ఏర్పరచుకున్నారు. ఆ వలయం పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది’’ అని శాంతి భూషణ్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆయన కిరణ్ బేడీపై మరోమారు ప్రశంసల జల్లు కురిపించారు. కేజ్రీవాల్ కంటే కిరణ్ బేడీనే సమర్థవంతమైన పాలన అందించగలరని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News