: కేజ్రీవాల్ పై పోటీలో తెలుగు వ్యక్తి
వచ్చే నెలలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై ఓ తెలుగు వ్యక్తి పోటీలో నిలిచారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలానికి చెందిన కందుకూరు సునీల్ కుమార్ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిన్న సాయంత్రం నామినేషన్ దాఖలు చేశారు. అధికారులు తన నామినేషన్‌ను ఆమోదించినట్లు సునీల్ తెలిపారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలను అధికారులు, ప్రభుత్వం గాలికి వదిలేశారని ఆయన ఆరోపించారు. తనకు ఓటేసి గెలిపిస్తే అభివృద్ధి దిశగా నడిపిస్తానని అన్నారు.