: అండమాన్ దీవుల్లో స్వల్ప భూకంపం
అండమాన్ దీవుల్లో కొద్దిసేపటి క్రితం స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.5 గా నమోదైనట్లు భూగర్భ శాఖ వెల్లడించింది. ఈ భూకంపం కారణంగా జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు వెంటనే తెలియరాలేదు. ఇటీవలి కాలంలో అండమాన్ దీవుల్లో తరచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో అండమాన్ దీవుల్లో చోటుచేసుకుంటున్న భూకంపాలన్నీ స్వల్ప తీవ్రతతో కూడుకున్నవే. ఈ కారణంగానే తరచూ భూకంపాలు జరుగుతున్నా, ఎలాంటి నష్టం సంభవించడం లేదు.