: ఒడిశాలో హై అలర్ట్
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒడిశా ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పాకిస్థాన్ భూభాగం నుంచి పనిచేస్తున్న నాలుగు ఉగ్రవాద సంస్థలు దాడులకు పాల్పడే అవకాశం ఉందన్న ఇంటలిజెన్స్ బ్యూరో నివేదికతో ఒడిశా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హై అలర్ట్ ప్రకటించినట్టు ఆ రాష్ట్ర హోం స్పెషల్ సెక్రటరీ లలిత్ దాస్ వెల్లడించారు. "ఒడిశా డీజీపీ, ఇంటలిజెన్స్ డైరెక్టర్ పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించాలని నిర్ణయించారు. కీలకమైన అన్ని ప్రాంతాల్లో నిఘా పెంచాలని, టెర్రర్ దాడులను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు" అని లలిత్ దాస్ తెలిపారు. జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, సభలు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో నిఘాను మరింత పెంచుతామని చెప్పారు.