: గడ్చిరోలిలో మావోల ఘాతుకం... హైదరాబాదీ కాంట్రాక్టర్ వాహనాలకు నిప్పు


మహారాష్ట్రలో మావోయిస్టులు రెచ్చిపోయారు. గడ్చిరోలి జిల్లాలో విధ్వంసం సృష్టించిన నిషేధిత తీవ్రవాదులు 15 వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ వాహనాలన్నీ హైదరాబాదుకు చెందిన ఓ కాంట్రాక్టర్ కు చెందనవిగా భావిస్తున్నారు. నిర్మాణ రంగంలో కాంట్రాక్టర్ గా కొనసాగుతున్న హైదరాబాదీ వ్యక్తి, గడ్చిరోలిలో పనులు చేస్తున్నారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత సదరు కాంట్రాక్టర్ కు చెందిన సంస్థపై విరుచుకుపడ్డ మావోయిస్టులు, అక్కడి 15 వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో వాహనాలన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.

  • Loading...

More Telugu News