: కర్నూలు జిల్లా పొదుపు భవనంలో కలకలం... తహశీల్దారు జీపుకు నిప్పు


కర్నూలు జిల్లా సున్నిపెంటలో నేటి ఉదయం కలకలం రేగింది. పట్టణంలోని పొదుపు భవనం ప్రాంగణంలోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగులు, అక్కడ పార్కు చేసి ఉంచిన తహశీల్దార్ జీపుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో జీపు పూర్తిగా కాలిపోయింది. కొద్దిసేపటి క్రితం వెలుగు చూసిన ఈ ఘటన పట్టణంలో కలకలం రేపుతోంది. ఈ వాహనానికి నిప్పు పెట్టిన వ్యక్తులెవరన్న అంశంపై స్థానికుల్లో పలు ఊహాగానాలు మొదలయ్యాయి. సున్నిపెంట నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఈ ప్రాంతంపై మావోలకు మంచి పట్టు ఉండేది. తాజాగా తిరిగి బలం పుంజుకున్న మావోలే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News