: విశాఖ ఉత్సవాలకు తెర లేచేది నేడే... కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి వెంకయ్య!
విశాఖ ఉత్సవ్ కు నేడు తెర లేవనుంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఏపీ ప్రభుత్వం భారీ సన్నాహాలు చేసింది. నేటి ఉదయం మొదలు కానున్న ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు నాన్ స్టాప్ గా కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా నేడు పది వేల మందితో భారీ కార్నివాల్ జరగనుంది. నేటి మధ్యాహ్నం ఫామ్ బీచ్ నుంచి ఆర్కే బీచ్ దాకా కొనసాగే ఈ కార్నివాల్ లో యువత ఉత్సాహంతో పాలుపంచుకోనుంది. ఇక ఈ ఉత్సవాల్లో ప్రముఖులు కూడా సందడి చేయనున్నారు. ఇప్పటికే ఉత్సవ్ ఏర్పాట్లలో ఏపీ మానవవనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు నిండా మునిగిపోయారు. ఈ కార్యక్రమాలకు ఏపీ మంత్రులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరుకానున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుుడు విశాఖ ఉత్సవ్ లో తనదైన రీతిలో సందడి చేయనున్నారు.