: దేశంలో లింగ నిష్పత్తి పడిపోవడంపై మేనకాగాంధీ ఆందోళన


దేశంలో లింగ నిష్పత్తి పడిపోవడంపై కేంద్ర మంత్రి మేనకాగాంధీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ దేశంలో కనీసం రెండువేలమంది మంది బాలికలను గర్భంలో ఉండగానే చంపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది జాతి సిగ్గు పడాల్సిన విషయమని అన్నారు. పానిపట్ లో 'బేటీ బచావో-బేడీ పఢావో' పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె పైవిధంగా స్పందించారు. దేశంలోకెల్లా హర్యానాలో లింగ నిష్పత్తి మరీ దారుణంగా ఉందని అన్నారు. అక్కడ భ్రూణ హత్యలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. 'మేక్ ఇన్ ఇండియా', 'స్వచ్ఛ భారత్ అభియాన్', 'జన్ ధన్ యోజన' తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆ స్థాయిలో ప్రచారం చేస్తున్న పథకం 'బేటీ బచావో-బేటీ పఢావో'. దీని అమలుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తామని ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొనడం తెలిసిందే.

  • Loading...

More Telugu News