: స్వైన్ ఫ్లూ నివారణలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది: కాంగ్రెస్ నేత పొంగులేటి
అత్యంత వేగంగా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూను నివారించడంలో టీఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఈ విషయాన్ని స్వయంగా కేసీఆరే అంగీకరించారని అన్నారు. రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యానికి భద్రత లేదని మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు హెలికాప్టర్లలో తిరగడం మానేసి, భూమి మీదకు వస్తే వాస్తవాలు తెలుస్తాయని దెప్పిపొడిచారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైనా... ఇతర పార్టీల నేతలను ఆకర్షించడంలో మాత్రం కేసీఆర్ సఫలమయ్యారని ఎద్దేవా చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్... ఇప్పుడు సిలబస్ మార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎంసెట్ ఎవరు నిర్వహిస్తారో కూడా తెలియని స్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులకు భూపంపిణీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చే అంశం ఏమైందని నిలదీశారు.