: లిఖితపూర్వక ఉత్తర్వుల కోసం వేచిచూస్తున్నాం: బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్


సుప్రీంకోర్టు తీర్పు పట్ల బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు శివలాల్ యాదవ్ స్పందించారు. తాము లిఖితపూర్వక ఉత్తర్వుల కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. సుప్రీం ఆదేశాలను అనుసరించి బీసీసీఐ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. తొలుత వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించి, సర్వ సభ్య సమావేశం ఎప్పుడు నిర్వహించాలన్న విషయాన్ని నిర్ణయిస్తామని వివరించారు. బీసీసీఐ అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలంటూ సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆదేశించింది. అంతేగాకుండా, గతేడాది డిసెంబర్ 17న జరగాల్సిన సర్వ సభ్య సమావేశాన్ని కూడా వాయిదా వేయాలని పేర్కొంది. అటు, ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్ బీసీసీఐ అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే ఐపీఎల్ లో పెట్టుబడి వదులుకోవాలని కూడా అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

  • Loading...

More Telugu News