: ఏపీలో మంద కృష్ణ అడుగుపెట్టడానికి వీల్లేదు: ఎమ్మార్పీఎస్


ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగకు ఘోర అవమానం ఎదురైంది. తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించి, సీమాంధ్ర ప్రజల మనోభావాలను గాయపరచిన మంద కృష్ణ ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, మంద కృష్ణ అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ ఘటన కడపలో చోటు చేసుకుంది. మంద కృష్ణను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News